గునిపర్తి గ్రామంలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
సర్పంచ్ బుర్రా రాధికా కర్ణాకర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
గునిపర్తి: అక్టోబర్ 18 ప్రజా నేస్తం జ్వాల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు గునిపర్తి గ్రామంలో అంబరాన్నంటాయి. గ్రామ సర్పంచ్ బుర్రా రాధికా కర్ణాకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం విశేషం. గ్రామీణ సంస్కృతి, ఐక్యతను చాటిచెప్పేలా వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి.