నడికూడలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
నడికూడ, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): నడికూడ మండల కేంద్రములో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు.
పూల పండుగతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం విశేషం. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని మహిళలు ప్రార్థించారు.
ఈ వేడుకల్లో సర్పంచ్ మలహాల్ రావు, గ్రామ కార్యదర్శి, గ్రామ మహిళలు, యువతులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.