🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 5:15 pm Posted by : Praja Nestham Jwala News

ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీరాటి లింగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ

News Image


హనుమకొండ, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీరాటి లింగారెడ్డి ప్రమాదవశాత్తు గాయపడి హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆసుపత్రికి వెళ్లి లింగారెడ్డిని పరామర్శించారు.

ఈ సందర్భంగా లింగారెడ్డి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు. చల్లా ధర్మారెడ్డి వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
🏠 Home