🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 5:14 pm Posted by : Praja Nestham Jwala News

తాళ్ల మల్కాపురంలో ఘనంగా మహా అన్నదానం.. భారీగా తరలివచ్చిన భక్తులు!

News Image


తాళ్ల మల్కాపురం: గ్రామంలో శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ రామాంజనేయ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలు, పెద్దలు, దాతలు, ఇతర సహకారదారులకు శ్రీ రామాంజనేయ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరి భాగస్వామ్యంతో అన్నదానం సజావుగా నిర్వహించామని పేర్కొన్నారు.
🏠 Home