🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 5:13 pm Posted by : Praja Nestham Jwala News

అధిక శబ్ద పరికరాలు విక్రయిస్తే కఠిన చర్యలు

News Image
హనుమకొండ, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్‌): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అధిక శబ్దాలు చేసే పీకలు, ఇతర ప్రమాదకర శబ్ద పరికరాలను విక్రయిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేయూసీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రవికుమార్ హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరికరాలను విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

చిన్నపిల్లలు, యువత హానికరమైన శబ్ద పరికరాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అధిక శబ్దాల వల్ల వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు శబ్ద కాలుష్యానికి దూరంగా ఉంటూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
🏠 Home