హైదరాబాద్–అమరావతి బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట, కోదాడ మీదుగా వెళ్లాలి
సూర్యాపేట, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): హైదరాబాద్–అమరావతి బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను జాతీయ రహదారి–65కు సమాంతరంగా సూర్యాపేట, కోదాడ మీదుగా ఏర్పాటు చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా జేఏసీ సభ్యులు, బీజేపీ నాయకులు ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీని కలిసి ఈ మార్గం వల్ల జిల్లాకు కలిగే ప్రయోజనాలను వివరించారు.
సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళితే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని నాయకులు పేర్కొన్నారు. వినతిపై స్పందించిన ఈటల రాజేందర్ ప్రతిపాదనను పరిశీలించి స్పందిస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కడియం రామచంద్రయ్య, తుక్కాని మన్మధరెడ్డి, వంగవీటి శ్రీనివాసరావు, దండా శ్రీనివాస్‌రెడ్డి, దండా మురళీధర్‌రెడ్డి, మేడబోయిన యాదగిరి, మాలోతు శక్రు నాయక్, గుండ్ల సత్యనారాయణ, జేఏసీ కన్వీనర్ జానకిరామ్‌రెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, ధర్మార్జున్‌రెడ్డి, వనిత, సీనియర్ జర్నలిస్టు భూపతి రాములు తదితరులు పాల్గొన్నారు.