టీజీఎన్పీడీసీఎల్కు జాతీయ స్థాయి ఇన్నోవేషన్ అవార్డు
హనుమకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): విద్యుత్ పంపిణీ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగానికి తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) 14వ జాతీయ స్థాయి ‘ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్’ అవార్డును దక్కించుకుంది. అక్టోబర్ 14న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సంస్థ కంపెనీ సెక్రటరీ కె. వెంకటేశం అవార్డును స్వీకరించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి అధికారులు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. స్కడా (SCADA), డ్రోన్ల ద్వారా విద్యుత్ లైన్ల తనిఖీలు, ఏఐ చాట్‌బాట్ వంటి సాంకేతికతలతో వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ అవార్డు ఉద్యోగుల సమష్టి కృషికి గుర్తింపని పేర్కొన్నారు.