కొత్తకొండలో శరన్నవరాత్రి వైభవం
కొత్తకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించి, కాళరాత్రి దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సర్వతోభద్ర మండల ఆవాహన, చతుఃషష్టి ఉపచార పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి. కిషన్‌రావు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. అర్చకులు, సిబ్బంది, రాంబాబు, జానకిపురం రవి శర్మ, వినయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.