🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 9:12 am Posted by : Praja Nestham Jwala News

కీతవారిగూడెం అంగన్వాడీ కేంద్రం తలుపులు ధ్వంసం

News Image

ఆకతాయిల పనిగా అనుమానం.. కేంద్రం నిర్వాహకురాలు మల్లమ్మ వెల్లడి

కీతవారిగూడెం (ప్రజానేస్తం జ్వాల):సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2లో తలుపులు ధ్వంసమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు ఆకతాయిలు అంగన్వాడీ కేంద్రం తలుపులను కాలితో తన్ని విరగ్గొట్టారని కేంద్రం నిర్వాహకురాలు యల్లావుల మల్లమ్మ తెలిపారు.
చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ప్రాథమిక విద్యకు తోడ్పడే అంగన్వాడీ కేంద్రంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
🏠 Home