భద్రాచలంలో సామూహిక భజన కార్యక్రమం
📌 శ్రీ సీతారామచంద్రస్వామివారి సన్నిధిలో సామూహిక భజన నిర్వహిస్తున్న కీతవారిగూడెం శ్రీశ్రీశ్రీ అంబాత్రేయ భజన బృందం సభ్యులు.
భద్రాచలం, అక్టోబర్ 4 (ప్రజానేస్తం జ్వాల):ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శ్రీరామదాసు సేవా సొసైటీ అధ్యక్షులు శ్రీశ్రీ మాన్యపు సిద్ధేశ్వర స్వామి వారి ఆదేశాల మేరకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి సన్నిధిలో శ్రీరాముని జన్మనక్షత్రం పునర్వసు కావడంతో, ఆ నక్షత్రం వచ్చిన రోజున కల్యాణం మరియు సామూహిక భజన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.కీతవారిగూడెం గ్రామం, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీశ్రీశ్రీ అంబాత్రేయ భజన బృందం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి పాదాల చెంత భజనలు నిర్వహించారు. ఉదయం వేళ భక్తులు శ్రీరామ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ సందర్భంగా భజన బృందం అధ్యక్షులు దాసరి నాగేంద్రబాబు, ఉపాధ్యక్షులు దాసరి నరసమ్మ ఆధ్వర్యంలో భక్తులు సామూహికంగా భజనలు, శ్రీరామ నామస్మరణ చేశారు. శ్రీరాముని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని వారు ఆకాంక్షించారు.భద్రాచల శ్రీరామచంద్రస్వామివారి సన్నిధిలో భజన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.