సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత
📌 పద్మ విభూషణ్ ప్రొఫెసర్ రామారావు (89)కు పలు సంస్థల ఘన నివాళులు
మెటలర్జీ, అణు భౌతిక శాస్త్ర రంగాలకు విశేష సేవలు.. దేశానికి తీరని లోటు
హైదరాబాద్: భారతదేశ అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరైన పద్మ విభూషణ్ ప్రొఫెసర్ పల్లె రామారావు (89) కన్నుమూశారు. మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, అణు భౌతిక శాస్త్ర రంగాల్లో విశేష కృషి చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆయన మృతి పట్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు, పలు శాస్త్ర, విద్యా సంస్థలు సంతాపం వ్యక్తం చేశాయి.
1937 జూన్ 30న కర్నూలులో జన్మించిన రామారావు ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలో పూర్తి చేసి, బెంగళూరు, మద్రాస్, ఆంధ్ర, బెనారస్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో మెటీరియల్ సైన్స్‌లో పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు.
డీఎంఆర్‌ఎల్ డైరెక్టర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి, ఓషన్ డెవలప్‌మెంట్ కార్యదర్శి, ఏఈఆర్‌బీ చైర్మన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ తదితర కీలక హోదాల్లో ఆయన సేవలందించారు. డీఆర్‌డీవో, ఇస్రోల్లో డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్‌గా కూడా పనిచేశారు.
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో రామారావు కీలక పాత్ర పోషించారని సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్ వి. కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఏఆర్‌సీఐ, ఎన్‌ఎఫ్‌టీడీసీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సేఫ్టీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు వంటి సంస్థల స్థాపన, అభివృద్ధిలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.
రామారావు మరణంతో జన విజ్ఞాన వేదిక, ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ (ఏఐపీఎస్‌ఎన్) సహా పలు సంస్థలు సంతాపం వ్యక్తం చేశాయి. విజ్ఞాన శాస్త్రం, పరిశోధన, విద్య, దేశసేవ రంగాలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతిగా, శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా ఆయన చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పలువురు నివాళులర్పించారు.