🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 6:40 pm Posted by : Praja Nestham Jwala News

హుజూర్‌నగర్‌లో నిర్వహించిన తెలంగాణ జాగృతి ముఖ్య నాయకుల సమావేశం

News Image
📌 తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు జాగృతి కృషి - రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కే మస్తాన్‌.
మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి
బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపు

హుజూర్‌నగర్‌, అక్టోబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన, సేవా కార్యక్రమాల విస్తరణకు తెలంగాణ జాగృతి సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కే మస్తాన్ అన్నారు.ఆదివారం హుజూర్‌నగర్‌ పట్టణంలో ఎస్‌కే మస్తాన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలంగాణ జాగృతి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు, యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు జాగృతి తరఫున కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు జాగృతిని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కార్యకలాపాలను విస్తరించి ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు.

📌 ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

ఈ నెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఘనంగా నిర్వహించాలని ఎస్‌కే మస్తాన్ సూచించారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి సీనియర్‌ నాయకులు కేఎల్‌ఎన్‌ రావు, గుండు శ్రీను, వల్లపుడాసు కొండలు, ఉదారి సుధాకర్‌, సీహెచ్‌ నర్సింహారావు, వేణు, జక్కుల లక్ష్మణ్‌, కిరణ్‌రెడ్డి, బత్తిని శ్రీను, బి.వెంకటేష్‌, బి.మహేష్‌, జేమ్స్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home