🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 6:35 pm Posted by : Praja Nestham Jwala News

పెద్దపల్లిలో గంజాయి కలకలం

News Image
📌 గంజాయి స్వాధీనం.. పోలీసుల ప్రత్యేక నిఘా

పెద్దపల్లి, అక్టోబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): పెద్దపల్లి పట్టణంలో గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. కొలనూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టణంలో మరో వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

పట్టణంలో అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరించినా, ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా వినియోగం కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత, కుటుంబ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
🏠 Home