పరకాలలో మహిళ హత్య కేసు ఛేదింపు
పరకాల, అక్టోబర్ 4 (ప్రజానేస్తం జ్వాల):హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలోని ఆకులవాడలో ఇటీవల చోటుచేసుకున్న మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాంనగర్‌కు చెందిన నేరెళ్ల రమేష్ (38)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు బంగారు పుస్తెలు, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.పరకాల ఏసీపీ సతీష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.
సెప్టెంబర్ 30 అర్ధరాత్రి ఆకులవాడలోని ఓ ఇంట్లోకి నిందితుడు పైకప్పు మార్గం ద్వారా చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న మహిళలు అతడిని గమనించి కేకలు వేయడంతో వారిపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో కోడెల సుగుణ మృతి చెందగా, కోడెల లసుమక్క తీవ్రంగా గాయపడింది.అనంతరం నిందితుడు బాధితుల వద్ద ఉన్న రెండు బంగారు పుస్తెలతో పాటు రూ.1,000 నగదు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.శనివారం వెల్లంపల్లి రోడ్డులోని మున్సిపాలిటీకి వెళ్లే మార్గంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నేరెళ్ల రమేష్ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
అనుమానం వచ్చిన పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా, ఆకులవాడ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు.విచారణలో తాను మద్యానికి బానిసై, భార్య విడిచి వెళ్లడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను కేసులో కీలక ఆధారాలుగా పోలీసులు నమోదు చేశారు.కేసును ఛేదించడంలో చురుకుగా వ్యవహరించిన ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు పవన్, రఘుపతి లను ఏసీపీ సతీష్‌బాబు అభినందించారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.