🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 12:30 pm Posted by : Praja Nestham Jwala News

ఏనుమాముల మార్కెట్ ఎదుట భారీ అగ్నిప్రమాదం

News Image
వరంగల్: గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని ఏనుమాముల మార్కెట్ ఎదుట ఉన్న చంద్ర కిరణ్ కోల్డ్ స్టోరేజ్ సమీపంలోని ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ప్లాస్టిక్ స్క్రాప్‌కు మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
🏠 Home