అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కేసారం నుంచి చింతకుంటకు వెళ్తున్న ప్రైవేటు బస్సు అనంతగిరి ఘాట్ రోడ్డులో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రులకు తరలించేందుకు సహకరించారు. పోలీసులు, సహాయక బృందాలు కూడా సహాయక చర్యలు చేపట్టాయి.
మంత్రి పొంగులేటి దిగ్భ్రాంతి
అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.