పోటీ పరీక్షల అభ్యర్థులకు పుస్తకాల పంపిణీ
హుజూర్‌నగర్ శాఖా గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందన్‌లాల్ పవార్ సూచన మేరకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా హుజూర్‌నగర్ ఎమ్మార్వో బండ కవిత స్వయంగా పోటీ పరీక్షల పుస్తకాలను అభ్యర్థులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలను సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి ప్రణాళికాబద్ధంగా చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని ఆమె తెలిపారు.కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ బచ్చు రామారావు, లైబ్రేరియన్ ఇన్‌చార్జ్ కంచర్ల శ్రీధర్‌రెడ్డి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.