🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 7:26 am Posted by : Praja Nestham Jwala News

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

News Image
ప్రముఖ దర్శకుడు, భారతీయ సినీ రంగంలో వినూత్న ప్రయోగాలకు మారుపేరుగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
తెలుగు సినీ పరిశ్రమతో పాటు భారతీయ చలనచిత్ర రంగంలో సింగీతం శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘మయూరి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రయోగాత్మక కథాంశాలు, వినూత్న కథనం ఆయన చిత్రాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
కె.వి.రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్‌లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయన సినీ అభిరుచికి నిదర్శనంగా నిలిచింది.
సింగీతం శ్రీనివాసరావు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు, భారతీయ సినిమాకు అందించిన వినూత్న ఆలోచనలు చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.
🏠 Home